Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా మరోసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందించారు. మంత్రివర్గ విస్తరణపై(Cabinet Expansion) చర్చలు జరుగుతున్నాయని, కానీ ఆ విషయంలో తుది నిర్ణయం తమ చేతుల్లో లేదని అన్నారు. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని తామూ అనుకోవట్లేదని అన్నారు.

- Advertisement -

‘‘ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజం. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు. ఎవరు చెరువులను ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది’’ అని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ అధిష్ఠానందేనని స్పష్టం చేశారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి పనులు అప్పగించాలన్న అన్ని అంశాలు అధిష్ఠానమే చూసుకుంటుందని వివరించారు.

‘‘అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నాం. రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాం. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుంది. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదు టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ తల్లి ఉండేది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో ₹ 64 వేల కోట్ల అసలు వడ్డీలు కట్టాం.

రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి ₹ 6,400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే 64 వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డం. పదేళ్ల తరువాత హాస్టల్స్ కి ఇచ్చే డైట్ చార్జీలు పెంచాం. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం. గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నాం’’ అని Bhatti Vikramarka అన్నారు.

Read Also: ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...