Bhatti Vikramarka | రూ.16.70 లక్షల కోట్లతో ఏం కట్టారు.. బీఆర్ఎస్ కు భట్టి ప్రశ్నలు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ప్రతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలే ఆయుధాలవుతున్నాయి. ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన బడ్జెట్ చర్చల్లో భాగంగా బీఆర్ఎస్‌ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేశారని, కానీ దాంతో ఏం నిర్మించారో ఎవరికీ తెలియదంటూ చురకలంటించారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో ఆర్థిక క్రమశిక్షణ జాడ కూడా లేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చారే తప్ప.. వాటిని ఎలా వాడారు అన్నది మాత్రం ఎన్నడూ చెప్పలేదని విమర్శించారు.

- Advertisement -

‘‘రూ.16.70 లక్షల కోట్లతో నాగార్జున సాగర్ నిర్మించారా? ఎస్ఆర్‌ఎస్పీ నిర్మించారా? ఓఆర్ఆర్ నిర్మించారా? ఎయిర్‌పోర్ట్ కట్టారా? ఒక్క కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా కూలిపోయింది. సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టారు. తమ పదేళ్ల పాలనలో ఒక్క గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారా? అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని కాగ్ స్వయంగా వెల్లడించింది. వాటిని ఏం నిర్మించడానికి వాడారు?’’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).

Read Also: సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Vizag Mayor | విశాఖపై వైసీపీ ప్రతివ్యూహాలు… రంగంలోకి బొత్స సత్యనారాయణ

విశాఖ మేయర్(Vizag Mayor) పీఠం ఎవరికి దక్కనుంది అనే అంశం ఏపీ...

Gayatri Bhargavi | తన భర్తపై iDream మీడియా తప్పుడు ప్రచారం.. యాంకర్ గాయత్రి ఫైర్

యాంకర్, నటి గాయత్రి భార్గవి(Gayatri Bhargavi) తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ థంబ్...