తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ‘సామాన్య వ్యక్తుల్లా బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి కుటుంబం’ అంటూ పోస్ట్ చేసింది.
“సోమవారం సాయంత్రం విమానాశ్రయంలో విమానం దిగి బయటకు వచ్చే క్రమంలో మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబంతో కలిసి సామాన్య వ్యక్తిలా అధికార ఆర్భాటాలు లేకుండా బస్సులో నిలబడి ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇది కదా ప్రజాపాలన అని బస్సులో ఉన్న ప్రయాణికులు చర్చించుకున్నారు” అని తెలిపింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భట్టి(Bhatti Vikramarka) సింప్లిసిటీని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Deputy Chief Minister Bhatti Vikramarka Mallu, travelled by bus along with their family members.
సామాన్య వ్యక్తిలా బస్సులో ప్రయాణించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లు గారు వారి కుటుంబ సభ్యులు.
👉 నిన్న సాయంత్రం హైదరాబాద్ విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా ఒక ప్రయాణికుడు విమానం… pic.twitter.com/XL4HDMvJXR
— Congress for Telangana (@Congress4TS) January 2, 2024