Vemulawada | వేములవాడలో భక్తులకు ఇక్కట్లు.. నిర్లక్ష్యమే కారణం..

-

Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు(Kodelu) సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కాగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా వారికి తగిన ఏర్పాటు చేయడంలో అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.

- Advertisement -

Vemulawada | అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు తిప్పలు పడుతున్నారు. గంటల తరబడి భక్తులు లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ప్రత్యేక దర్శనాల్లో వస్తున్న భక్తులను కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అర్ధరాత్రి నుంచే క్యూలో 6 గంటలపాటు వేచి ఉన్నప్పటికీ దర్శనం కాలేదని, ప్రధాన ఆలయంలోకి అనుమతించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కాకుండానే శిఖర దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.

Read Also: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hyderabad Metro | రాష్ట్రానికి నిధులు ఇవ్వండి.. మోదీని కోరిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు...

Gujarat | శివాలయంలోని శివలింగం చోరీ..

Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం...