డీఎస్‌ను చంపడానికి అర్వింద్ కుట్ర చేస్తున్నాడు: ధర్మపురి సంజయ్

-

Dharmapuri Sanjay |తెలంగాణ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇవాళ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖను పంపించారు. ఈ వ్యవహారంపై డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్‌ స్పందించారు. తన తండ్రి రాజీనామా వెనుక తమ కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడి(ఎంపీ అర్వింద్) హస్తం ఉందని ఆరోపించారు.

- Advertisement -

ఇది పక్కా అరవింద్‌ పనే అని సంజయ్‌ మండిపడ్డారు. నిన్న తన తండ్రి డీ శ్రీనివాస్‌ ఎంతో సంతోషంగా అందరి సమక్షంలో మీడియా సాక్షిగా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారని, సుమారు మూడు గంటలు గాంధీభవన్‌లో ఉన్నారని సంజయ్‌(Dharmapuri Sanjay) అన్నారు. ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా అంటూ తన తల్లి లేఖను విడుదల చేయడాన్ని సంజయ్‌ తప్పు పట్టారు. ఇదంతా అరవింద్‌ పనేనని సంజయ్‌ చెప్పారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, తండ్రిని చంపడానికి తన తమ్ముడు కుట్ర చేస్తున్నాడని సంజయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తే అర్వింద్‌మీద పోటీ చేయడానికి సిద్ధమని అభిప్రాయపడ్డారు.

Read Also: నా పుట్టినరోజున మీ నుంచి కోరుకుంటుంది అదే: కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...