టాలీవుడ్ నటి డింపుల్ హయాతీ(Dimple Hayathi)కి తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పోలీసు పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను, న్యాయవాది డేవిడ్‌ను పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరికీ సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మే 17న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్(FIR)ను కొట్టివేయాలంటూ దాఖలలైన పిటిషన్‌ను జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి జూన్ 7 బుధవారం రోజున విచారించారు. ఇద్దరి తరపు న్యాయవాదుల వాదనల అనంతరం.. డింపుల్(Dimple Hayathi) ఖచ్చితంగా కోర్టు ఇంకా పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.