Disha encounter case: దేశవ్యాప్తంగా దిశ రేప్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. దిశ ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఎన్ కౌంటర్ కు గురైన బాధితుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృంద కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన వృందా కార్వేల్ పోలీసుల తీరుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్ కౌంటర్(Disha encounter case) చేశారని న్యాయవాది పేర్కొన్నారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు వెల్లడించారు. కానీ కమిషన్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఈ విషయం చెప్పలేదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వృందా వాదనలు ముగియగా ప్రభుత్వం తరఫు వాదనలు కోర్టులో వినిపించాల్సి ఉంది. జనవరి 23న ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనుండటంతో తదుపరి విచారణను హైకోర్టు 23కు వాయిదా వేసింది.