‘రైతులకు కేసీఆర్‌ సర్కార్ న్యాయం చేయకపోగా.. అన్యాయం చేస్తోంది’

-

అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో చేతికొచ్చిన పంటనష్టం వర్షం పాలై రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ(DK Aruna) విమర్శలు చేయడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ 40 కిలోల ధాన్యం బస్తాకు 3 కిలోల తరుగు తీస్తూ రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ(BJP) అధికారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని ఆమె అన్నారు.
రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ ఖాతాలో వేసుకుంటోందని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహచరించడంలేదని డీకే అరుణ(DK Aruna) విమర్శలు చేశారు. తమ వంతు ఇవ్వాల్సిన నిధులను కూడా బీఆర్ఎస్(BRS) సర్కార్ కేటాయించడం లేదని ఆమె ధ్వజమెత్తారు. రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్(KCR) సర్కార్ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరే జెండా కాషాయ జెండానే అని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...