తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(Revanth Reddy) తమిళనాడు డీఎంకే నేతలు ఈరోజు ఢిల్లీ కలిశారు. ఈ నెల 22న చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సమావేశం జరగనుందని, అందులో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం చర్చించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి ఈ సమావేశానికి రావాలని వారు కోరారు. కాగా, పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత తాను ఈ సమావేశానికి హాజరవుతానని రేవంత్ చెప్పారు.
డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియపై అమలు అనేది ఏ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నదే ఈ సమావేశ ప్రధాన అజెండాగా చెప్పినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు తీసుకుంటామని సీఎం రేవంత్(Revanth Reddy) వివరించారు. అంతేకాకుండా తమిళనాడు కన్నా ముందే డీలిమిటేషన్‌పై తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అనేది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అంశమని రేవంత్ చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోని బీజేపీ కూడా భాగం అవుతుందని, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి రాజకీయాలకు అతీతంగా జర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.