ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్(Dost notification) విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ వివరాలను విడుదల చేశారు. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్((Dost notification)) ప్రక్రియ కొనసాగనుంది. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్, జూన్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ తర్వాత రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి జూన్ 26 వరకు కొనసాగనున్నాయి. జూన్ 16 నుంచి 27 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జూన్ 30న రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 1 నుంచి 5 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, జూన్ 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్స్, జూలై 10న మూడో విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు జరగనుంది.
TS: ఇంటర్మీడియట్ పూర్తైన విద్యార్థులకు బిగ్ అలర్ట్
-