భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లోనే డబుల్ డెక్కర్ బస్సుల ప్రయాణం

-

హైదరాబాద్(Hyderabad) వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రకటించింది. బస్సులు తిరిగే ప్రాంతాలను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. రూ.12.96కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ బస్సులు తిరుగుతున్నా ఏ రూట్లలో తిరుగుతున్నాయనే దానిపై ప్రజలకు సమాచారం లేక ఆదరణ పొందలేదు. దీంతో అధికారులు ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

- Advertisement -

Hyderabad |ఉదయం ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరే డబుల్ డెక్కర్ బస్సులు.. బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో తిరిగి సాయంత్రానికి తిరిగి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్, ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటుచేశారు.

ప్రస్తుతానికి కొన్నిరోజుల పాటు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. తర్వాత డిమాండ్ బట్టి కనీస ఛార్జీగా ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకుల స్పందనను బట్టి మరికొన్ని రూట్లలో కూడా ఈ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.

Read Also: రాహుల్ గాంధీకి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...