వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు

-

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(Praneeth Hanumanthu)పై డ్రగ్స్ కేసు నమోదైంది. ఈసారి మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడలోని సెంట్రల్‌ జైలులో ఉన్న ప్రణీత్‌ హనుమంతు గతంలో డ్రగ్స్‌ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.

- Advertisement -

ప్రణీత్ ని ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి, కుమార్తె ఉన్న వీడియో పై యూట్యూబ్ లైవ్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశాడు. ఆ వీడియోపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ రావడంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు తదుపరి విచారణ నిమిత్తం ప్రణీత్‌(Praneeth Hanumanthu)ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని మాదకద్రవ్యాల వినియోగం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలతో అతనికి ఉన్న సంబంధాల గురించి మరిన్ని వివరాలను వెలికితీసేందుకు అదనపు విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్.. కాసేపటికే..

Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...