హైదరాబాద్‌లో ఓ యువతి ఆర్టీసీ(TSRTC) బస్సులో హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో కండక్టర్‌పై దాడికి దిగింది. విధుల్లో ఉన్న కండక్టర్‌ను పచ్చి బూతులు తిడుతూ నానా రచ్చ చేసింది. చిల్లర లేదని చెప్పినందుకూ కాలితో తన్నుతూ రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు వారించినా వారిపైనా దాడి చేసేందుకు యత్నించింది. చంపుతా అంటూ బెదిరించింది. దీంతో ప్రయాణికులు ఈ తతంగాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ యువతి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హయత్‌నగర్ బస్ డిపో-1కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ పరిధిలోని బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది. ఐదు వందల రూపాయల నోటు ఇచ్చింది. చిల్లర లేదని కండక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా తిట్ల దండకం అందుకుంది. తాను లోకల్ అని.. నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియోలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) తీవ్రంగా స్పందించారు. మొదటి ట్రిప్పులో తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ యువతి ఏ మాత్రం వినకుండా దాడికి పాల్పడిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా.. దాడులకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు యువతిని అరెస్ట్ చేసి శిక్షించాలని ఆర్టీసీ(TSRTC) సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
A Woman assaults #TSRTC bus conductors, allegedly the #DrunkWoman created #nuisance in the bus and uses #abusive words, kicks against TSRTC bus conductors, belongs to Hayatnagar Depot -1, video goes viral
The @TSRTCHQ official lodged a complaint against her.#Hyderabad #drunk pic.twitter.com/np0zVvYwnN
— Surya Reddy (@jsuryareddy) January 31, 2024