తెలంగాణ అంతటా తీవ్ర చర్చలకు దారితీస్తున్న ఘటన రాజలింగమూర్తి హత్య(Rajalinga Murthy Murder). అతనిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆయన హత్య వెనక కేసీఆర్, కేటీఆర్ హస్తముందన్న వాదనల్లో వాస్తవమెంత? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూర్తి హత్యపై డీఎస్పీ సంపత్‌రావు(DSP Sampath Rao) స్పందించారు. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నా వదిలి పెట్టమని అన్నారు. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నామని ఆయన వివరించారు.
Rajalinga Murthy Murder | ‘‘మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టం. రాజలింగమూర్తికి, హంతకులకు భూతగాదాలు ఉన్నాయి. దీంతో పాటు మరిన్ని ఇతర కోణాల్లో కూడా కేసును దర్యాప్తు చేరస్తున్నాం. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నాం. అతి త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటాం’’ అని డీఎస్‌పీ సంపత్‌రావు తెలిపారు.