Intintiki BJP | పార్టీ కార్యక్రమాలకు ఈటల, కోమటిరెడ్డి దూరం!

-

తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ‘ఇంటింటికీ బీజేపీ(Intintiki BJP)’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలను కలిసి ప్రజలకు చేరువ కావాలని ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీ డీలా పడిన తరుణంలో ఈ యాక్టివిటీ మైలేజ్ ఇస్తుందని హైకమాండ్ భావించింది. కానీ కొందరు నేతలు తమకేం పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇతర నేతలంతా ఇంటింటికీ బీజేపీ(Intintiki BJP) కార్యక్రమంలో పాల్గొన్నా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender), మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) మాత్రం పాల్గొనలేదు. వాస్తవానికి ఇరువురు నేతలు యోగా దినోత్సవం రోజున కూడా పాల్గొనకపోవడం గమనార్హం. అయితే ఇరువురు నేతలు కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే యాక్టివిటీకి దూరంగా ఉన్నట్లుసమాచారం. పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్‌కు కూడా కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అలా ఏమీ జరగకపోవడంతో పార్టీ తనకు ప్రాధాన్యత కల్పించలేదని ఈటల సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Read Also:
1. ఆ హక్కు మాకు ఉంది.. రేవంత్ రెడ్డి
2. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...