బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌తో హుజురాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజాసింగ్(Raja Singh) నివాసానికి ఈటల రాజేందర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనపై పార్టీ వేసిన సస్పెన్షన్‌పై చర్చించారు. ఈ క్రమంలో తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ దూరంగా ఉంటానని ఈటలతో రాజాసింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేగాక, గోషామహాల్(Goshamahal) బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే టార్గెట్ చేసిన తన అనుచరులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలపై కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందని గుర్తుచేశారు. అనంతరం రాజాసింగ్‌కు ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. గోషామహాల్ కార్యకర్తలపై నమోదైన కేసుల గురించి పార్టీలో చర్చించడంతో పాటు వెంటనే ఎత్తివేసేలా కార్యచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, సస్పెన్షన్ ఎత్తివేతపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఈటల వెల్లడించారు.