ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేయడం శుభసూచికమని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కేసీఆర్‌ను గద్దే దించే బాధ్యతను బీజేపీ నిర్వర్తించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా గెలవాల్సింది బీజేపీ(BJP) మాత్రమే అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కావని… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తప్పుడు హామీలిచ్చి, మన కళ్లల్లో మన్ను కొట్టిన కేసీఆర్ ను ఓడించాలని ప్రజలను ఈటల(Eatala Rajender) కోరారు. రాష్ట్ర ప్రజల బతుకేందో, కన్నీళ్లు ఏందో తెలిసిన బిడ్డగా చెపుతున్నానని.. బీజేపీనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ మాటల్లోనే ఉందని.. అసలైన బంగారు తెలంగాణను చేతలతో బీజేపీ చూపెడుతుందని.. అందుకే బీజేపీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.
Read Also: BRS కి ట్రైలర్ చూపించాం – మోదీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat