ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) ప్రభుత్వాన్ని విమర్శించారు. గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి ఆమోదించడం లేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీ కార్మికులు గుండెల్లో బాధను మర్చిపోలేదన్నారు. మహిళా కండక్టర్లను ఇష్టం లేకపోయినా రాజ్‌భవన్ వద్ద ధర్నాకు పంపుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటల(Eatala Rajender) మండి పడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు బకాయి ఉన్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆర్టీసీ విలీనం బీజేపీ(BJP)కి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.