Rajagopal reddy :మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలిచేందుకు తాపత్రయ పడుతున్నాయి. శక్తిమేర ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక కారణంగా మునుగోడు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుండగా, డబ్బు ప్రవాహంలా పంచుతున్నారనే వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక వ్యాపారులకు నగదు మళ్లించారంటూ ఈసీకు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఈసీ రాజగోపాల్ రెడ్డికి నోటీసులిచ్చింది.
రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy)దాదాపు రూ. 5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, కొంతమంది వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ డబ్బునంతా మునుగోడులో పంపిణీ చేసేందుకేనని, అందుకు సంబంధించిన పలు పత్రాలను ఈసీకి సమర్పించారు. సదరు 22 ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయక ముందే.. ఆ ఖాతాలను స్తంభింపజేయాలని ఈసీని భరత్ కుమార్ కోరారు.
టీఆర్‌ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పకపోతే.. చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఆ నగదు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారో స్పష్టంగా చెప్పాలనీ.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాదని నిరూపించుకోవాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.
Read also: Cm KCR: ఢిల్లీ బ్రోకర్‌లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టారు