Munugode Bypoll: తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం హాట్‌గా నడుస్తోంది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే సందేహం అందరిలో ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో మునుగోడు(Munugode)లో ఏం జరిగినా అది పెద్ద ఇష్యూగా మారుతోంది. ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును అధికారం లేకున్నా మార్చిన వివాధం పై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆయనతో పాటు ఎన్నికల అధికారికి భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీని సైతం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.
జగన్నాథరావును సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులను ఈరోజు ఉదయం 11 గంటలకల్లా ఢిల్లీ పంపాలని ఆదేశించినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడులో ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మైక్రో అబ్జర్వర్స్‌ను నియమిస్తున్నాట్టు వివరించారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేలా చూస్తామని.. ఇప్పటివరకు రూ.2.94 కోట్ల నగదును స్వాధీనం చేసుకొని.. 21 కేసులను పోలీస్ శాఖ నమోదు చేయగా.. అబ్కారీ శాఖ ఈ మరో 123 కేసులు నమోదు చేసినట్లు వికాస్ రాజ్ వివరించారు.
Read also: చిన్నారి మృతదేహం నుంచి తలను తీసుకువెళ్లి…?