ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని స్పష్టం చేసింది. ఆప్ నాయకులకు రూ.100 కోట్లను చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొంది.
“ఈ కేసు(Delhi Liquor Scam)లో ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలోనూ తనిఖీలు నిర్వహించాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు 15 మందిని అరెస్ట్ చేశాం. రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. అరెస్ట్ చేసిన కవిత(Kavitha)కు ఈ నెల 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు చేశాం. ఆ సమయంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు” అని ప్రకటనలో వెల్లడించింది. కాగా తనను ఈడీ(ED) అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.