Ed questioning minister Talasani Srinivas yadav brothers: మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌లను ఈడీ మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నాట్లు సమాచారం. కాగా గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నాట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. కానీ.. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాలేదని తెలుస్తుంది.
- Advertisement -