ED Raids once again in hyderabad 30 teams in the field: తెలంగాణలో ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ చేస్తుంది. హైదరాబాద్‌తో పాటుగా కరీంనగర్ జిల్లాలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 30 టీమ్స్ రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈడీ, ఐటీ అధికారులు కలిసి జాయింట్ అపరేషన్‌లో ఈ రైడ్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సోదాలు మరోసారి చేస్తున్నారా? లేదా.. వేరొక కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది
- Advertisement -


 
                                    