Malla Reddy | మల్లారెడ్డికి ఈడీ నోటీసులు.. పీజీ సీట్ల విషయంలోనే..

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి(Malla Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. మల్లారెడ్డికి సంబంధించి మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అవకతవకలపై వివరణ ఇవ్వాలని వారు నోటీసుల్లో కోరినట్లు సమాచారం. అయితే గతేడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల అనంతరం భారీ సంఖ్యలో డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అనలైజ్ చేయడం ముగియడంతోనే తాజాగా మల్లారెడ్డి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

అంతేకాకుండా గతేడాది 10 ప్రవేటు మెడికల్ కాలేజీలు 45కు పైగా పీజీ సీట్లను బ్లాక్ చేశాయి. ఆ తర్వాత వాటిని అధిక మొత్తానికి విక్రయించారని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాటిపై వివరణ కోరడం కోసమే మల్లారెడ్డి(Malla Reddy)కి నోటీసులు జారీ చేసినట్లు ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి.

Read Also: కంగువా ప్రీరిలీజ్‌కు ప్రభాస్ వస్తున్నాడా..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...