ఫార్ములా ఈ రేస్ కేసు(Formula e Car Race) పై ED దూకుడు పెంచింది. కేసులో భాగంగా నేటి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఏ 3 గా ఉన్న మాజీ HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి, IAS అధికారి అరవింద్ కుమార్ లకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పురపాలకశాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి? హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బిఐ అనుమతి లేకుండా రూ. 46 కోట్ల విదేశీ కరెన్సీ ని ఎందుకు చెల్లించాల్సి వచ్చింది. వంటి అంశాలపై BLN రెడ్డి ని ప్రశ్నించనున్నారు. ఈ కేసు(Formula e Car Race)లో ఈడీ నోటీసుల మేరకు ఏ1 గా ఉన్న కేటీఆర్ ఈ నెల 7న, 3న అరవింద్ కుమార్ లు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.