తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. వేసవి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలని అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎండలు విపరీతంగా ఉండంటతో పట్ణణాల్లో జనాలు బయటకు రారని.. ఈ ప్రభావం పోలింగ్‌పై ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ సమయం గంట పాటు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.
Polling Time | సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈసీ నిర్ణయంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కానీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.