Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. రిట్నరింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈనెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలు, అభ్యర్థితో పాటు ఐదుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.
అయితే ఈసారి అభ్యర్థులు తమ నేరాలను అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనాలంటూ ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అలాగే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అధికారికి సమర్పించాలి. సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కల్పించింది. నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత వివరాలు పత్రాలను తప్పనిసరిగా దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడవిట్ పత్రాలను 24 గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు .
Telangana Assembly Elections | రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. 3కోట్లకు పైగా ఉన్న ఓటర్లు తమ ఓటు వినయోగించుకునేందుకు మొత్తం 35,356 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ సిద్ధంగా ఉన్నాయి.