Etala Rajender Comments On CM KCR: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. TRS పార్టీ తెలంగాణ సాధనకోసం ఏర్పడిందని.. BRS ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస – బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఈటల.. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయదని, మళ్లీ సెంటిమెంటును రగిలించేందుకు టీఆర్ఎస్, వైసీపీ తో కలిసి చేసే డ్రామాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తో కలిసి రెండు రాష్ట్రాలు కలిసుండాలనే సెంటిమెంటును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.