Pushpa Srivani: ఏపీకి మూడు రాజధానులు అనేది సీఎం జగన్ విజన్‌తో కూడిన ఆలోచన అని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాలనే ఉద్దేశంతో అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేయబోతున్నామని అన్నారు. అమరావతి అనేది కేవలం 29 గ్రామాలకు పరిమితమైనటువంటి ఒక రాజధాని అని.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరమని, రాష్ట్రంలో ఇంత సంక్షేమ అభివృద్ధి జరిపిస్తూ లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టే పరిస్థితిఉందా? అని ప్రశ్నించారు. విశాఖను అభివృద్ధి చేసినట్లయితే కొన్ని దశాబ్దాల్లోనే తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌ను తలదన్నే రాజదానిగా అవుతుందని Pushpa Srivani అన్నారు.
Read also: నయన్ సరోగసి విచారణ పూర్తి.. రేపు సర్కర్‌కు నివేదిక