కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి… రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

-

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత స్పీడ్ తగ్గించింది. బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక అని కమలం పార్టీలో చేరిన నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేసేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీతో ఆయన భేటీ అయ్యారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధనలో చంద్రశేఖర్ తన వంతు కర్తవ్యం నిర్వహించారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ అత్యంత అవినీతికి పాల్పడ్డారన్నారు. బీజేపీ మాటలు నమ్మి చంద్రశేఖర్ గతంలో ఆ పార్టీలో చేరారన్నారు. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆహ్వానానికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. ఈ నెల 18న కాంగ్రెస్ జాతీయా ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా సభ నిర్వహించనున్నామన్నారు. ఆ సభలో పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని వ్యాఖ్యానించారు. 35లక్షల ఎకరాల దళితుల భూములను రకరకాల రూపాల్లో ఈ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి భూములు అమ్ముకుంటోందని రేవంత్ విమర్శించారు.

దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారని.. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమే అన్నారు. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలను వదిలించేందుకు కాంగ్రెస్‌తో నాయకులు కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...