మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy)ల సస్పెన్షన్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి ఇద్దరు అగ్రనేతలను పార్టీ సస్పెండ్ చేయడం చర్చనీయాంశం అయింది. కాగా వేటు వేయడంపై తగ్గేదేలే అన్నట్టు స్పందించారు జూపల్లి. పార్టీ నుండి బయటకి రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
Jupally Krishna Rao |జూపల్లి కామెంట్స్
పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది.
కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్న.
మీ వంద మాగదులతో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారు.
నాకు భయపడి సస్పెండ్ చేశారా.
మీ బండారం బయట పడుతుందని సస్పెండ్ చేశారా.
పారదర్శకంగా పాలన చేయాల్సిన భాధ్యత సీఎం పై ఉంది.
నా రాష్ట్రం నా ఇష్టం అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉంది.
వినాషకాలే విపరీత బుద్ధి.
రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది..కెసిఆర్ ఫోటో ఉంది.
మా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండాలో వీళ్ళు చెబుతారా.
నాకు మూడేళ్లుగా సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకపోయినా కెసిఆర్ ఫోటో మా ఇంట్లో ఉంది.
నేను కాంగ్రెస్ లో గెలిచినా… ఇండిపెండెంట్ గా గెలిచా…ఒకసారి ఓడిపోయా..
నా ఓటమికి కారణం పార్టీ పెద్దలే.
ప్రశ్నించే గొంతులో ఉండద్దా.
నిరంజన్ రెడ్డికి నిజాయితీ ఉందా.
ప్రాజెక్ట్ ల్లో జరుగుతున్న అవకతవకల మీద ప్రశ్నిస్తున్న.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడు.
నేను ఎవరితో లబ్ది పొందలేదు.
మా నియోజకవర్గం లో ఉద్యమకారుల మీద అనేక కేసులు పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో బూత్ లో జూపల్లి మనుషులు కూర్చో వద్దనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం నిలబడాలి అన్నదే నా కర్తవ్యం.
తెలంగాణ ఉద్యమ ద్రోహులకు అందలాలు… తాయిలాలు.
పేపర్ లీకేజిపై మాకు బాధ్యత లేదు అన్నట్లుగా ప్రగతి భవన్ పెద్దలు వ్యవహరిస్తున్నారు.
భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది.