ఇంటర్(Intermediate) విద్యార్థులు పరీక్ష తేదీ కట్టాల్సిన తేదీలు వచ్చేశాయి. నవంబర్ 6 నుంచి 26వ తేదీ వరకు ఈ ఫీజు కట్టడానికి సమయం ఉంది. ఒక వేళ ఆలస్యమైతే రూ.100 లేట్ ఫీజుతో నవంబర్ 27 నుంచి 4 డిసెంబర్ వరకు ఫీజును చెల్లించొచ్చని అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఆలస్య రుసుం రూ.500తో డిసెంబర్ 5 నుంచి 11 వరకు, రూ.1000 లేట్ ఫీజుతో డిసెంబర్ 12 నుంచి 18 వరకు, రూ.2 వేల లేట్ ఫీజుతో డిసెంబర్ 19 నుంచి 27 వరకు చెల్లించే వెసులుబాటు ఉన్నట్లు అధికారులు ఈరోజు ప్రకటించారు. విద్యార్థులంతా కూడా వీలైనంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లించుకోవాలని సూచించారు అధికారులు.
అయితే ఇంటర్ మీడియట్(Intermediate) తొలి సంవత్సరం జనరల్ కోర్సులకు రూ.520, ఒకేషనల్ కోర్సులకు రూ.750, రెండో సంవత్సరం జనరల్ ఆర్ట్స్ కోర్సులకు రూ.520, సైన్స్, ఒకేషనల్ కోర్సులకు రూ.750 ఫీజును నిర్ధారించారు అధికారులు. ఈ ఫీజును ప్రతి విద్యార్థి కూడా ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ముందుగానే చెల్లించుకోవాలని సూచించారు.