వన్ స్టేట్ వన్ కార్డ్‌కు కృషి.. ఎన్నో లాభాలుంటాయన్న మంత్రి

-

ఫ్యామిలీ డిజిటల్ కార్డులను(Family Digital Cards) వీలైనంత త్వరగా అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్డుల్లో కుటుంబాలకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయని, పెళ్ళి అయిన వారి వివరాలు , చనిపోయిన వారి వివరాలను అడిగితెలుసుకుని అప్‌డేట్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. వన్ స్టేట్ వన్ కార్డ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిని ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్డుతో ప్రతి కుటుంబానికి ఎన్నో లాభాలు ఉంటాయని కూడా ఆయన వివరిస్తున్నారు. ఈ కార్డులో మహిళలే గృహ యజమానులుగా ఉంటారని, ఆ విధంగానే ప్రభుత్వం కూడా గుర్తించనుందని ఆయన తెలిపారు. ఈ ఒక్క కార్డుతోనే ఆరోగ్యం, రైతు బంధు, రైతు బీమా సహా తదితర పథకాలను కూడా పొందొచ్చని తెలిపారు. ఈ కార్డుల సర్వేను ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు ఆయన(Ponnam Prabhakar) తెలిపారు.

- Advertisement -

‘‘ప్రతి కుటుంబానికి గుర్తింపు ఉండేలా డిజిటల్ కార్డును(Family Digital Cards) సిద్ధం చేస్తున్నాం. ఇందులో ప్రతి కుటుంబానికి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. ఒక్క కార్డుతోనే ప్రజలు అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు. రైతు రుణమాఫీని కూడా పొందొచ్చు. ఈ కార్డు సర్వేను ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్‌లా ప్రారంభించినా.. అతి త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్ట్‌గా కూడా మారుస్తాం. అదే విధంగా కుటుంబీకులు అంగీకరిస్తేనే ఫ్యామిలీ ఫొటో తీసుకోవాలని అధికారులను ఆదేశించాం’’ అని కూడా ఆయన చెప్పారు.

Read Also: కొండా సురేఖ అవమానించింది సమంతను కాదు: ఆర్‌జీవీ
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...