Farmhouse Mlas Case sit searches in kerala: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వేగం పెంచింది. దేశవ్యాప్తంగా 7 బృందాలతో నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానాలో ఆదివారం సిట్ సోదాలు చేసింది. కాగా.. ఈ కేసులో కేరళకు చెందిన ఓ డాక్టర్‌కు సంబంధం ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ డాక్టర్ రామచంద్రభారతికి సన్నిహితుడని తెలుసుకున్న అధికారులు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు వస్తున్నాట్లు తెలుసుకున్న డాక్టర్ తప్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే.. ఆశ్రమానికి వెళ్లిన అధికారులకు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. డాక్టర్‌కు పోలీసులు వస్తున్నారని ఆశ్రమంలోని ఇన్‌చార్జ్ సమాచారం అందించడంతో తప్పించుకున్నాడని తెలిపారు. దీంతో కేరళ పోలీసుల సాయంతో ఆశ్రమం ఇన్‌చార్జీని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాట్లు సమాచారం.