కాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఫంక్షన్‌ హాల్‌లో అగ్నిప్రమాదం

-

తెలంగాణలోని నిర్మల్(Nirmal) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కాసేపట్లో పెళ్లి అనగా.. ఇంతలో ఫంక్షన్‌ హాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బంధువులు, పెళ్లివారు ఎవరూ ఇంకా మండపానికి రాకపోవడం పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలీ క్రాస్ రోడ్డు వద్దనున్న సూర్య ఫంక్షన్ హాలులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.

- Advertisement -

ఫంక్షన్ హాల్‌లోని కిచెన్ వైపు మంటలు చెలరేగి హాలు పైకప్పున ఉన్న సీలింగుకు మంటలు వ్యాపించాయి. ఇదే మండలంలోని దని గ్రామానికి చెందిన ఓ అబ్బాయికి సదరు ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు పెళ్లి ఉండగా.. కొందరు ముందే అక్కడకు చేరుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. అప్పటికే బంధువులు ఎవరూ అక్కడకు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు అక్కడకు చేరుకొని షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

 Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...