హైదరాబాద్(Hyderabad)లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఐదవ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులను భవనం వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్లో సాఫ్ట్ వేర్ సంస్థ ఉందని స్థానికులు చెబుతున్నారు. Ndrf, police ,fire సిబ్బంది తో మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow us on: Google News, Koo, Twitter