రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం