Hyderabad | ఆరాంఘర్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల నష్టం

-

హైదరాబాద్‌(Hyderabad)లోని ఆరంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్నంతా ఆవరించింది. దీంతో చుట్టుపక్కల ప్రజలంతా ఉక్కిరిబిక్కి అవుతున్నారు.

- Advertisement -

ఈ ప్రమాదంలో కోట్ల రూపాయాల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమైన ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆరాంఘర్(Aramghar) అంతటా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: జిల్లా కలెక్టర్‌పై లగచర్ల గ్రామస్తుల దాడి
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...