Gachibowli | గచ్చిబౌలిలో టెన్షన్.. పక్కకి ఒరిగిన 5 ఫ్లోర్స్ బిల్డింగ్

-

హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పక్కకి ఒరిగిన ఘటన స్థానికంగా టెన్షన్ క్రియేట్ చేసింది. సిద్ధిక్ నగర్ లోని ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో సెలార్ కోసం గుంత తవ్వడంతో భవనం పిల్లర్ దెబ్బతిని పక్కకి ఒరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనం పక్కకి ఒరుగుతున్నట్లు గుర్తించిన అందులోని నివాసితులు పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ బయటికి పరుగులు పెట్టారు.

- Advertisement -

Gachibowli | వారి కేకలు విని బయటకు వచ్చి చూసిన స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారు కూడా భయంతో ఇళ్లను ఖాళీ చేసి బయటకు వచ్చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా(Hydra), డిఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. బయటకు వచ్చిన నివాసతుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరి కాసేపట్లో హైడ్రాలిక్ యంత్రంతో భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అక్కడ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించడం వల్లనే భవనం దెబ్బతినిందని అధికారులు గుర్తించారు.

Read Also: ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...