Food poisoning at kasturba girls hostel narayankhed: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 35 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైయారు. విషయం తెలుసుకున్న సిబ్బంది. వారిని వేంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు కడుపునోప్పితోను మరి కొందరికి వంతులు విరోచనలతో ఇబ్బంది పడుతున్నాట్టు వైద్యులు పేర్కొన్నారు. మేరుగైన వైద్యం అందిస్తున్నామని, విలైనంత వేగంగా వారు కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉదయం టిఫిన్ లో ఏమైనా పురుగులు పడ్డాయా లేదా రాత్రి తినే అన్నంలో ఏమైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.