Forest Department staff demands weapon for self defence: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూమి విషయంలో వాగ్వాదం తలెత్తడంతో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై వేట కొడవళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.. కాగా ఈ క్రమంలో దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన పై అటవీ శాఖ సిబ్బంది(Forest Department) ఆందోళన చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఫారెస్ట్ భూములకి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ యంతాంగం సర్వేకు వ్యతిరేఖంగా భూముల కోసం గిరిజనుల పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో పోడు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేశారు. దీన్ని..నిరసిస్తూ మంగళవారం గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గిరిజన రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన గిరిజనులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై దాడి చేసినట్లు సమాచారం