తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు కీలక పదవి దక్కింది. సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారు(Chief Advisor)గా ఆయన నియమితులయ్యారు. సోమేశ్‌కుమార్(Somesh Kumar)ను మూడేళ్లపాటు కేబినెట్ మంత్రి హోదాలో ముఖ్య సలహాదారుగా చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.
2019 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్‌కుమార్‌ను రిలీవ్ చేసి ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ ఏడాది జనవరిలో పదవీవిరమణ చేయాల్సి వచ్చింది. విభజన తర్వాత సోమేశ్‌కుమార్(Somesh Kumar)ను తెలంగాణకు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీంతో ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో డ్యూటీకి రిపోర్టు చేసినా, తర్వాత సోమేష్ కుమార్ వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Read Also: రహస్య ప్రాంతానికి పాక్ మాజీ ప్రధాని
Follow us on: Google News, Koo, Twitter