Nadendla Bhaskara Rao | కుల గణనపై మాజీ సీఎం అనుమానం

-

తెలంగాణ కులగణనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు(Nadendla Bhaskara Rao) ఘాటుగా స్పందించారు. ఈ అంశంపై తనకు ఒక అనుమానం ఉందని అన్నారు. కింది స్థాయి కులాల వాళ్లమని అనుకునే వారు పెద్ద స్థాయి కులాల వారి ఇంటి పక్కనే భూములు కొని ఇల్లు కట్టుకుంటున్నారని, ఇలాంటి సమయంలో కుల గణనతో ఇబ్బంది తలెత్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారాయన. తాను కుల గణనకు వ్యతిరేకం కాదని, కేవలం సూచన చేయాలనిపించే మాట్లాడుతున్నానని వివరించారు. కుల గణన(Caste Census) వల్ల ఇబ్బందులు తలెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎటూ చేపట్టారు కాబట్టి కుల గణనలో ఎటువంటి గజిబిజి లేకుండా సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు 50 % వరకే రిజర్వేషన్లు ఉండటానికి అంగీకారం తెలిపింది. కుల గణనతో రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నించినా కోర్టులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానం తనకు కలుగుతుందని అన్నారు.

- Advertisement -

గ్రామాల్లో అలజడి వచ్చే పరిస్థితి వస్తుందని, కులం తెలుసుకోవాలనే అనుకుంటే అందుకు చాలా మార్గాలు ఉన్నాయని తెలిపారు. కుల గణన అని కదిలిచ్చి.. అలజడిని రేకెత్తించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని సూచించారు. అలా చేస్తే రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టిన వారవుతారని అన్నారు. కుల గణన అనేది మంచి ఆలోచన కాదేమో అని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా సరికాదని చెప్పారు. అయితే ఇప్పటి వరకు రేవంత్ పాలన బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం పదవి అనేది రేవంత్ రెడ్డి వయసు తగిన బాధ్యత కాకపోయినా బాగా పరిపాలనను కొనసాగిస్తున్నారని మెచ్చుకున్నారు. మూసీ ప్రక్షాళన చాలా అవసరమని, దానిని వీలైనంత త్వరగా కడగిపారేయకుంటే కష్టమని Nadendla Bhaskara Rao అన్నారు.

Read Also: కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్ప ఇంకేమున్నాయ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...