పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Baba Fasiuddin) గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ(Deepa Das Munshi) సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
“ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేందుకు కొంత మంది కుట్ర చేస్తూంటే పార్టీ అధినాయకత్వం వారిపై చర్యలు తీసుకోలేదు. పైగా వారికే మద్దతు ఇచ్చారు. రాజకీయంగానే కాకుండా భౌతికంగా కూడా నిర్మూలించే కుట్ర చేస్తున్నారని తెలిసి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా పనిచేశా. ఉద్యమకారుడికి రక్షణ కరువైంది. అందుకే పార్టీకి రాజీనామా చేస్తు్న్నాను” అని కేసీఆర్(KCR)కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ తొలి డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్(Baba Fasiuddin) విధులు నిర్వర్తించారు.