రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసారు. ప్రమాదానికి గల కారణాలపై దృష్టి పెట్టకుండా.. జరిగిన దుర్ఘటనకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఘటన స్థలానికి వెళ్తే అడ్డుకున్నారు. సలహాలు, సూచనలు చేసే ప్రయత్నం చేసిన అనుమతించలేదని తెలిపారు. SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన రోజున హరీష్ రావు ఎందుకు రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించడం విడ్డురంగా ఉందన్నారు.
ఫిబ్రవరి 21న ఓ శాసన సభ్యుడి కుమార్తె ప్రీ వెడ్డింగ్ కు హరీష్ రావు(Harish Rao) దుబాయ్ కి వెళ్లారు. వారు మాత్రమే వెళ్లారని సీఎం మాట్లాడడం హాస్యపదం అని అన్నారు. నల్గొండ కు చెందిన ఓ మంత్రితో పాటు చాలామంది ఎమ్మెల్యే లు హాజరయ్యారు అని తెలిపారు. SLBC పనులను పునఃప్రారంభించిన సమయంలో అనుమతులు ఏవైనా ఉన్నాయా? అంటూ నిలదీశారు. ఒక మంత్రి హెలికాఫ్టర్ లేదంటూ ఘటన స్థలానికి వెళ్ళకపోవడం.. మంత్రి విదేశాల్లో తిరగడం.. సీఎం ఎలక్షన్ కాంపెయిన్ లో ఉంటూ అక్కడికి వెళ్లలేని స్థితిలో ఉన్నారని అన్నారు. మంత్రులు తీవ్ర అసహనానికి లోనై బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్(Congress) ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గం గమనిస్తుందని అన్నారు.
ప్రాజెక్టుపై సరైన అవగాహన లేక.. ప్రభుత్వ దుందుకుడు చర్యల వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రమాదం సంభవిస్తే ముందస్తు చర్యలేవి పాటించలేదని విమర్శించారు. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయిస్తే ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిపినా 42 మంది కార్మికులను లోపలి పంపించారని.. ప్రమాదం నుండి బయటపడ్డ కార్మికులు తెలిపినట్లు శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) వెల్లడించారు.