తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగరవేస్తున్న సమయంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహమూద్ అలీ కింద పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో పైకి లేవలేకపోయారు. అప్రమత్తమైన పార్టీ శ్రేణులు ఆయనను పైకి లేపారు. స్పృహ కోల్పోవడంతో చేతులపై మోసుకుంటూ తీసుకెళ్ళి వాహనంలో కూర్చోబెట్టారు. హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ భవన్ లో #KTR జెండా ఎగురవేసే టైంలో తోపులాట లో కింద పడ్డ మాజీ హోం మంత్రి మహమూద్ అలి
అపోలో హాస్పిటల్ లో చేరిన మహమూద్ అలి.#BRS#trsbhavan pic.twitter.com/28KQQw8RH5
— Shareef (@shareef_journo) January 26, 2024
Read Also: జనసేన పోటీ చేసే తొలి రెండు స్థానాలు ప్రకటించిన పవన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat