మూసీ ప్రాజెక్ట్(Musi Project) పునరుజ్జీవన కార్యక్రమ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారు. ఏది ఏమైనా మూసీ పునరుజ్జీవన చేసి తీరుతామని ఇప్పటికే పలుసార్లు చెప్పిన సీఎం రేవంత్(Revanth Reddy).. ఇప్పుడు చెప్పినట్లే శంకుస్థాపన తేదీని కూడా ప్రకటించారు. కానీ మూసీ ప్రాజెక్ట్ అంశంలో రాజకీయ చర్చ తీవ్రంగా ఉన్న క్రమంలో, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీలో పలు విమర్శలు చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడం కీలకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న మూసీ ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం పూర్తి చేయాలని నిశ్చయించుకుందని సీఎం రేవంత్ వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై(Musi Project) ముందడుగు వేయడమే తప్ప వెనకడుగు వేసేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ చేశామని, అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నామని సీఎం వెల్లడించారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అదే విధంగా మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారికి డబుల్ బెడ్‌రూమ్‌తో పాటు ఆర్థిక సహాయంగా రూ.2 లక్షల నగదు కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రజలను తమప్రభుత్వం ఎప్పటికీ అనాథలను చేయదని పేర్కొన్నారు.