Hyderabad |డ్రగ్స్ విక్రయిస్తున్న గ్యాంగ్ ను మాదాపూర్ ఎస్వోటి అధికారులు రాయదుర్గం పోలీసులతో కలిసి అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి కోటీ 33 లక్షల విలువ చేసే కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Stephen Raveendra) శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మొదట కాకినాడకు చెందిన సూర్యప్రకాష్ (26)ను పట్టుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాలతో చింతా రాకేష్ రోషన్, శ్రీనివాస్ రెడ్డి, నైజీరియా దేశానికి చెందిన విక్టర్ చుక్వూలను నానక్ రాంగూడ రోటరీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి కోటీ 33 లక్షల విలువ చేసే కొకైన్ సీజ్ చేసారు. మరో నిందితుడు గాబ్రియేల్ పరారీలో ఉన్నాడు. నిందితులు గోవా నుంచి 7 వేల రూపాయలకు గ్రాము చొప్పున కొకైన్ కొని హైదరాబాద్(Hyderabad) లో 15 నుంచి 18 వేల రూపాయలకు గ్రాము చొప్పున అమ్ముతున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది. వీరి నుంచి కొకైన్ కొంటున్నవారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. నిందితులపై రాయదుర్గం పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసారు.
Read Also: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు
Follow us on: Google News, Koo, Twitter