నంది అవార్డుల స్థానంలో తెలంగాణలో గద్దర్ అవార్డులు(Gaddar Cine Awards) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులను తెలంగాణలో ఇవ్వలేదు. వాటి స్థానంలో ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది. కాగా వాటిని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు అన్నదానిపై కూడా తాజాగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. 2025 ఉగాధి నుంచి గద్ధర్ సినీ అవార్డులను ప్రదానం చేయాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు(Bhaktha Ramadasu) జయంతి వేడుకల ముఖ్యఅతిథిగా భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగానే తెలంగాణలో ఉగాధి నుంచి గద్దర్ అవార్డులు(Gaddar Cine Awards) అందించనున్నట్లు ప్రకటించారు. ‘‘దశాబ్ద కాలంగా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కళాకారులను ప్రోత్సహించాలని నిశ్చయించాం. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాం. వీటిని ఈ ఏడాది ఉగాది నుంచి అందించనున్నాం’’ అని తెలిపారు.
Read Also: రఘురామ కేసు.. డీఐజీ సునీల్ నాయక్ కు నోటీసులు