సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Venkata Ramana Reddy) స్పందించారు. ఈ హత్యకేసులో తన హస్తం ఉందని, తానే సుపారీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ హత్యను బీఆర్ఎస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ‘‘రాజలింగమూర్తి(Rajalinga Moorthy) హత్యపై దుష్ట్రచారం చేస్తున్నారు. ఈ ఘటనను బీఆర్ఎస్‌కు అంటగట్టే యత్నం జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) వ్యాఖ్యలు బాధాకరణం. నేనే చంపించానని ఆయన అంటున్నారు.
బీఆర్ఎస్ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. ప్రోత్సహించదు కూడా. ఈ ఘటనతో నాకూ, బీఆర్ఎస్ ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనపై సీఐడీ, సీబీఐతో విచారణ జరిపి దోషులను శిక్షించాలి. మృతుడి భార్య బీఆర్ఎస్(BRS) తరపున కౌన్సిలర్‌గా గెలిచారు. కానీ విధానాలు నచ్చక ఆమెను పార్టీ దూరం పెట్టింది. మృతుడి భార్యతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో కూరుకుపోయాడు. గతంలో రౌడీషీటర్‌గా కూడా ఉన్నారు. ఆయన హత్యకు కూడా భూవివాదమే కారణం. ఈ హత్య కేసు నిందితుడు లొంగిపోయినట్లు మాకు సమాచారం అందింది’ అని ఆయన(Venkata Ramana Reddy) తెలిపారు.